విద్య మనసు పడిన తెలుగు హీరో ఎవరు..?
on Nov 28, 2016
బాలీవుడ్ తర్వాత అంత అందంగా ఉండే హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది టాలీవుడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పట్లో శోభన్ బాబును తెలుగువారు ఆరాధించినట్లే..బాలీవుడ్ భామలు సైతం ఇష్టపడేవారు. ఆయనతో జతకట్టడానికి కూడా సై అనే వారు.. ఆ తర్వాత తరంలో నాగార్జున, మహేశ్‌బాబులతో సినిమా చేయాలని ఉందని చాలా మంది బీ-టౌన్ బ్యూటీస్ చెప్పారు. మహేశ్ సంగతి పక్కన బెడితే టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సంగతి చూస్తే...ఐదు పదుల వయసు మీదపడినా..కొడుకులిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా ఆయన ఇంకా మన్మథుడే. మామూలు మహిళల నుంచి హీరోయిన్లు కూడా ఆయన్ను అభిమానిస్తారు.
అది తెలుగుకే పరిమితం కాలేదు..బాలీవుడ్‌లో కూడా కింగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పడే కాదు 90లలో బాలీవుడ్‌ని షేక్ చేసిన టబు, మనీషా కొయిరాల, కరీష్మా కపూర్, మాధురి దీక్షిత్, ప్రీతీ జింటా, ప్రియాంక చోప్రా ఇలా ఈ లిస్ట్ పెద్దదే. తాజాగా ఢర్టీ పిక్చర్‌తో యూత్ మతిపొగొట్టి..మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్‌ని తెలుగులో మీ ఫేవరేట్ స్టార్ ఎవరు అని అడిగితే..రెండో ఆలోచన లేకుండా నాగార్జున అని చెప్పేసింది విద్య. కుదిరితే ఆయనతో కలిసి నటించాలని తన మనసులో మాట బయటపెట్టింది. కహానీ-2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ ఈ సంగతులు చెప్పింది.