రామ్ చరణ్ 'చిరుత' చిత్రానికి సీక్వెల్ తీస్తే...
on May 22, 2020
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా పరిచయమైన 'చిరుత' చిత్రంలో కథానాయిక నేహ శర్మ గుర్తుందా? తెలుగులో ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. 'చిరుత' తర్వాత వరుణ్ సందేశ్ సరసన 'కుర్రాడు' చిత్రం చేసింది. తర్వాత హిందీకి వెళ్ళిపోయింది. పదేళ్లలో హిందీలో కూడా పెద్దగా సినిమాలు ఏమీ చేయలేదు. సోసోగానే కెరీర్ సాగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనుందని నేహ శర్మ చెబుతోంది.
"కథానాయికగా నేను పరిచయమైన 'చిరుత'కి సీక్వెల్ తీస్తే... అందులో నటించాలని ఉంది. అది కూడా రామ్ చరణ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది" అని తాజాగా నేహా శర్మ తెలిపింది. తెలుగులో రీ ఎంట్రీ కి రెడీ అని సిగ్నల్ ఇచ్చింది. చిరుత సీక్వెల్ కాకపోయినా ఇతర దర్శక నిర్మాతలు ఎవరైనా ఆమె సంప్రదిస్తారేమో చూడాలి. ఇప్పటికీ హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
