రెంట్ కట్టడానికి టీవీ నటి దగ్గర డబ్బులు లేవు
on May 22, 2020
కరోనా కల్లోలం ధాటికి చోటామోటా ఆర్టిస్టులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. హిందీ సీరియల్స్ షోస్ చేసే పంజాబీ నటుడు మమ్మీత్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 'హమారీ బహు సిల్క్' బృందంలో కొందరు నిర్మాతలు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్ లో నటించిన చాహత్ పాండే తను ఎంతగా ఆర్థిక సమస్యల్లో కూరుకున్నది తాజాగా వివరించారు.
"ఇప్పటి వరకు నేను సంపాదించిన ది ఏమైనా ఉందంటే అది 'హమారీ బహు సిల్క్' చేయడానికి ముందు సంపాదించినది. ఈ సీరియల్ చేసేటప్పుడు ఆ డబ్బులన్నీ తినడానికి, ట్రావెలింగ్ చేయడానికి, రెంటి కట్టడానికి ఉపయోగించాను. 'హమారీ బహు సిల్క్' చేసేటప్పుడు నిర్మాతలను డబ్బులు అడిగినా ఇవ్వలేదు. కరోనా క్రైసిస్ టైమ్ లో పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డాను. ఇప్పుడు అడుగుతుంటే అసలు సమాధానం చెప్పడం లేదు. చానల్ వాళ్ళు తమకు డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. పరిస్థితులు నా చేయి దాటి పోతున్నాయి. రెంట్ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. మా ఇంటి ఓనర్ రెంట్ అడుగుతున్నారు. ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు. అడగడం లో తప్పు ఏమీ లేదు. రెంట్ కట్టాలి లేదంటే ఖాళీ చేయాలి. నా దగ్గర మరో ఆప్షన్ లేదు. అందుకని నిర్మాతలు ఆఫీస్కి వెళ్లి వాళ్ళ ముందు ఏడ్చాను. బ్రతిమాలాను. అయినా డబ్బులు ఇవ్వలేదు. మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పారు" అని చాహత్ పాండే పేర్కొన్నారు.