"పోకిరి"ని పరిగెట్టించి మరీ కొట్టింది
on Aug 18, 2016
రకుల్ ప్రీత్ సింగ్.. అసలే అమ్మాయిది జిమ్ బాడీ. ఎప్పుడూ ఫిట్ నెస్ ని కాపాడుకొంటూ ఉంటుంది. దానికి తోడు ఆర్మీ కుటుంబం నుంచి వచ్చింది. తనతో పెట్టుకొంటే ఎవరైనా సరే.. చెడుగుడు ఆడేసుకొంటుంది. రకుల్ అదే చేసింది. ఓ పోకిరిని హీరోలా పరిగెట్టించి పరిగెట్టించి మరీ కొట్టిందట. అయితే ఇప్పుడు కాదు. కాలేజీ రోజుల్లో. ఓసారి ఫ్రెండ్స్ తో కలసి సరదాగా షాపింగ్‌కి వెళ్తుంటే.. ఓ ఆకతాయి ఫొటోలు తీశాడట. అది చూసిన రకుల్ రెచ్చిపోయిందట. ఆ ఫొటోలు డిలీట్ చేస్తావా, లేదా అంటూ గొడవకు దిగిందట. రకుల్‌ని తప్పించుకొని పారిపోతుంటే.. ఛేజ్ చేసి మరీ పట్టుకొని కొట్టిందట. ఆ ప్రయత్నంలో రకుల్‌కి కొన్ని దెబ్బలు తగిలాయట. కానీ.. చివరికి ఆ ఫొటోల్ని డిలీట్ చేసేవరకూ వదల్లేదట. 'నా జోలికొస్తే అంతే. ఇలానే తాట తీస్తా' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఫర్వాలేదు. రకుల్‌ని పెట్టుకొని ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసేయొచ్చు. బయటే అంతలా ఫైటింగులు చేస్తోందంటే తెరపై రెచ్చిపోదూ. కిప్ ఇట్ అప్ రకుల్.