కృష్ణవంశీ తప్పు చేస్తున్నాడా??
on Aug 18, 2016
నక్షత్రం సినిమాలో పొలోమంటూ స్టార్లని తీసుకొచ్చి నింపేస్తున్నాడు కృష్ణవంశీ. సందీప్‌కిషన్, కాజల్, సుదీప్, సాయిధరమ్ తేజ్, తనీష్... ఇలా ఈ సినిమాలో రోజుకొకరు చేరుతున్నారు. ఇప్పుడు ప్రగ్యాజైస్వాల్‌ని పట్టుకొచ్చాడు. సరే...కానీయండి అనుకొంటే ఆ అమ్మాయికి పోలీస్ క్యారెక్టర్‌ని అప్పగించాడు. పువ్వులాంటి అమ్మాయి పోలీసేంటో.. జనాలకు ఇప్పటికీ అర్థం కావడంలేదు. కంచె సినిమాలో ప్రగ్యా నిజంగానే సుకుమారంగా కనిపించింది. అలాంటి అమ్మాయికి పోలీస్ క్యారెక్టర్ ఎలా నప్పుతుందో అర్థం కావడం లేదు. దానికి తోడు తనతో రెండు ఫైట్లు కూడా చేయిస్తార్ట.
ఇప్పటికే ఈసినిమాలో స్టార్లు నిండిపోయారు. అది చాలదన్నట్టు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లనీ, హీరోల్నీ సంప్రదిస్తున్నాడట. కృష్ణవంశీ సినిమాలో ఆఫర్ వస్తే చాలు.. అనుకొంటున్నవాళ్లందరి లిస్టు వేసి, వాళ్లని పిలిపిస్తున్నాడట కృష్నవంశీ. ఇంతమంది హీరోలూ, హీరోయిన్లూ ఉంటే సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అసలే కృష్ణవంశీ ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ అంచనాల భారం మోయగలడా?? ఇంతమంది హీరోల్ని పట్టుకొచ్చి కృష్ణవంశీ తప్పు చేస్తున్నాడా?? తెలియాలంటే నక్షత్రం రావాల్సిందే.