శిరీష్‌లో ఆ టాలెంట్ కూడా ఉందా..?
on Aug 18, 2016
మాంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమాలో మనోడు తనలో ఉన్న మరో టాలెంట్ కూడా చూపించాడు. ఇప్పటీకే ఎన్టీఆర్, రవితేజ లాంటి వాళ్లు యాక్టింగ్‌తో పాటు సింగింగ్‌లోనూ తాము ఇరగదీయగలమని నిరూపించారు. అయితే వారే కాదు.. తనకు కూడా ఆ టాలెంట్ ఉందని ప్రూవ్ చేశాడు శిరీష్. ఎంతోమంది హీరోలను సింగర్స్‌గా మార్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అల్లు శిరీష్‌ని కూడా సింగర్‌గా మార్చేశాడు. తను మ్యూజిక్ ఇచ్చిన రీసెంట్ మూవీ శ్రీరస్తు శుభమస్తు సినిమాలో శిరీష్‌తో ఓ పాట పాడించాడు. అయితే ఈ పాటను సినిమాలో యాడ్ చేయకపోయినా యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన తమన్, ఈ గాయకుడు ఎవరో గుర్తుపట్టమంటూ పజిల్ విసిరాడు. పాటు పాడుతున్నపుడు అర్థం కాకపోయినా మధ్యలో వచ్చిన డైలాగ్స్‌లో మాత్రం అది శిరీష్ వాయిసే అని అర్థమైపోతోంది.