'ఇంటి' రహస్యం బయటపెట్టిన రకుల్..!
on Apr 19, 2016

రకుల్ ప్రీత్‌సింగ్ ఈమధ్య హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కొంది. రూ. కోటి రూపాయలు విలువ చేసే ఆ ఇంటి చుట్టూ... ఎన్ని గాసిప్పులు పుట్టాయో.! ఆ ఇంటిని ఓ యువ హీరో రకుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడని పుకార్లు లేవనెత్తారు. ఏకంగా కోటి రూపాయల గిఫ్ట్ ఇచ్చిన ఆ హీరో ఎవరబ్బా..అంటూ టాలీవుడ్ మొత్తం ఆరాలు తీసింది. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్పందించింది.
''నా ఇల్లు నేనే కొనుక్కొన్నా. ఎవరో కొనిస్తే నేనెందుకు తీసుకొంటా. చిన్నప్పటి నుంచీ కష్టపడి సంపాదించడం నా అలవాటు. అలా రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్న ఇల్లది. నాన్న పేరుమీద లోన్ కూడా తీసుకొన్నా. కావలిస్తే ఆ లోన్ పేపర్లు కూడా చూపిస్తా'' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ గాసిప్పులు వాళ్ల ఇంట్లోవాళ్ల వరకూ వెళ్లాయట. రకుల్ గురించి తెలుసుకాబట్టి వాళ్లేం అనలేదట. నాకు డబ్బు విలువ తెలుసని, వృథాగా ఖర్చు పెట్టే తత్వం కాదని, అందుకే.. ఇల్లు సంపాదించుకోగలిగానని అంటోంది రకుల్. ఇల్లు కొనిపెట్టే బోయ్‌ఫ్రెండ్ ఉంటే.. కోటి రూపాయల ఇల్లేం ఖర్మ, నాలుగైదు కోట్ల విలువ గల ఇల్లే కొనిపెట్టమనేదాన్ని అంటూ జోకులు కూడా వేస్తోంది. రకుల్ తాజా స్టేట్‌మెంట్‌తో ఈ ఇంటి చుట్టూ మూగిన రూమర్లకు చెక్ పడినట్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



