తేజ డైరెక్ట్ చేస్తున్న స్టార్ హీరో ఇతడే..!
on Apr 19, 2016

ఒకప్పుడు వరస హిట్లు కొట్టిన దర్శకుడు తేజ, ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, తెలుగు ప్రేక్షకులు తేజను ఆదరించలేదు. అయినా పట్టు విడవకుండా, త్వరలోనే ఒక స్టార్ హీరో సినిమాతో మళ్లీ హిట్ కొట్టబోతున్నానని ప్రకటించాడు. ఫ్లాపుల్లో ఉన్న తేజకు డేట్స్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. భల్లాలదేవుడు రానా. హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నాడు తేజ. దీంతో రానా, కాజల్ కాంబినేషన్లో తేజ సినిమా అంటే ఎలా ఉంటుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను తేజ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడట. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సినిమాల్లో, అద్భుతంగా రాణిస్తున్న కాజల్, ఈ మధ్యకాలంలో హిట్టు సినిమా లేని తేజ, సోలోహీరోగా హిట్టు లేని రానా కాంబినేషన్ సినిమాకు డేట్స్ ఎందుకు ఇచ్చిందా అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇప్పటికే తేజ డైరెక్షన్లో లక్ష్మీ కళ్యాణం మూవీలో కాజల్ నటించింది. బహుశా ఆ అభిమానంతోనే డేట్స్ అడ్జెస్ట్ చేసి ఉండచ్చు. మరి రానా, కాజల్ ల కాంబినేషన్లో తేజ ఏ జానర్ సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



