ఓబులమ్మగా రకుల్ ప్రీత్ సింగ్
on Dec 19, 2020
గ్లామర్స్ రోల్స్ లోనే కాదు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ సత్తా చాటిన వైనం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. కరెంట్ తీగ, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకి వంటి చిత్రాల్లో పల్లెటూరి అమ్మాయిగా రకుల్ నటన గుర్తుండిపోతుంది. ఆయా చిత్రాల్లో లంగావోణీల్లో కనువిందు చేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
కట్ చేస్తే.. ప్రస్తుతం క్రిష్ రూపొందిస్తున్న నవలాధారిత చిత్రం 'కొండపొలం' (వర్కింగ్ టైటిల్)లోనూ రకుల్ పల్లెటూరి పడుచుగా నటిస్తోంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ప్రసిద్ధ నవల కొండపొలం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాయలసీమకు చెందిన ఓబులమ్మ అనే పడతి పాత్రలో రకుల్ దర్శనమివ్వనుంది. అంతేకాదు.. రాయలసీమ మాండలీకంలో మునుపెన్నడూ కనిపించని కట్టుబొట్టుతో సర్ ప్రైజ్ చేయనుందట ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ.
అలాగే కరెంట్ తీగ, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకి చిత్రాల్లో గ్లామర్ తో కూడిన విలేజ్ గాళ్ రోల్స్ లో కనిపించిన రకుల్.. 'కొండపొలం'లో మాత్రం డీ-గ్లామర్డ్ విలేజ్ గాళ్ గా దర్శనమిస్తుందట. మరి.. రకుల్ నయా అవతారం ఆమెకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'కొండపొలం'.. త్వరలోనే ఓ ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కానుందని సమాచారం.
Also Read