తమన్నా డైరీ ఫుల్.. ఇప్పట్లో లేదు పెళ్లి ప్లాన్!
on Dec 19, 2020
ఉన్నట్లుండి సినిమాలతో సూపర్ బిజీగా మారిపోయింది మిల్కీ బ్యూటీ తమన్నా. 2019 సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్ 2' సినిమా ఆమె కెరీర్‌ను టర్న్ చేసిందని చెప్పాలి. 'బాహుబలి' తర్వాత సరైన అవకాశాలు లేవనుకుంటున్న తరుణంలో వచ్చిన ఆ సినిమాలో స్విమ్ సూట్‌లో ఆమె అందాల ఆరబోతకు యూత్ దాసోహమంది. హీరోయిన్ల కొరత కూడా ఆమెకు వరుస అవకాశాలు కల్పిస్తోందనేది కూడా నిజమే.
ఆహా ప్లాట్‌ఫామ్ కోసం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో '11th Hour' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న తమన్నా చేతిలో కనీసం ఐదు సినిమాలున్నాయి. గోపీచంద్‌తో సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న 'సీటీ మార్'లో జ్వాలా రెడ్డి అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది తమన్నా. సత్యదేవ్‌తో చేస్తున్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఇటీవలే 'అంధాధున్' తెలుగు రీమేక్‌ను ఆమె స్టార్ట్ చేసింది. ఒరిజినల్‌లో టబు చేసిన బోల్డ్ క్యారెక్టర్‌ను తమన్నా పోషిస్తోంది.
ఇక అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3'లో తన క్యారెక్టర్‌ను తిరిగి చేజిక్కించుకుందామె. ఇటీవలే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. అలాగే కె. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రధారిగా తనికెళ్ల భరణి రూపొందించ తలపెట్టిన సినిమాలో ఓ నాయికగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఆఫర్స్ వస్తుండటంతో జీవితంలో సెటిల్ కావాలన్న ఆలోచనను తమన్నా వాయిదా వేసిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21వ తేదీన 31వ బర్త్‌డేని ఆమె సెలబ్రేట్ చేసుకోబోతోంది. నిజానికి ఈ ఆఫర్స్ లేనట్టయితే 2021లో ఆమె పెళ్లి వార్త వినిపించేదే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సో.. జీవితంలో స్థిరపడేందుకు ఆమె మరికొంత కాలం టైమ్ తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.