'అయ్యప్పనుమ్ కోషియుమ్' ముహూర్తం ఫిక్స్
on Dec 19, 2020
మలయాళంలో ఘనవిజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రం.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించనున్న ఈ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్టర్ సాగర్ చంద్ర తెరకెక్కించనున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూర్చడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం (డిసెంబర్ 21) జరుగనున్నాయని.. రెగ్యులర్ షూటింగ్ జనవరి 2 నుంచి ప్రారంభం కానుందని వినికిడి. అంతేకాదు.. 2021 వేసవి చివరలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా, ఈ యాక్షన్ డ్రామాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు.