బెంగుళూర్ కోర్ట్ లో రజనీకాంత్ భార్య లత.. ఆ సమయంలో ఆమె వెంట ఉంది వీళ్ళే
on Dec 27, 2023

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2014 లో వచ్చిన సినిమా కొచ్చాడియన్. తెలుగులో విక్రమ్ సింహ అనే పేరుతో విడుదల అయ్యింది . రజనీకాంత్ రూపంతో మోషన్ క్యాప్షన్ తరహాలో రజనీ కాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకత్వంలో ఆ మూవీ తెరకెక్కింది. ఎప్పటినుంచో ఈ మూవీకి సంబంధించిన ఒక వివాదంలో రజనీ భార్య లత చిక్కుకున్నారు. తాజాగా వచ్చిన ఒక తీర్పు రజనీ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది.
కొచ్చాడియన్ మూవీని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థని భాగస్వామ్యంగా చేసుకుకొని లత రజనీకాంత్ తన మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించింది. ఆ సమయంలో మీడియా వన్ లో పని చేసే మురళి అనే వ్యక్తి ఈరోస్ దగ్గర 6 .2 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తానికి రజనీ భార్య లత హామీగా ఉండటంతో పాటు కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేసింది. ఆ తర్వాత గడువు దాటినా మురళి డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా గ్యారంటీ గా ఉన్న లత కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో ఈరోస్ సంస్థ లత మీద చీటింగ్ కేసు నమోదు చేసింది.
ఇపుడు ఈ కేసు వాయిదాకి లత బెంగళూరులోని కోర్ట్ కి హాజరయ్యింది. కేసు వాదోపవాదనలు విన్న జడ్జి లతకి లక్ష రూపాయిల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో ఆమె వెంట పెద్ద సంఖ్యలో రజనీ అభిమానులు ఉండటం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



