శ్రీయారెడ్డి పొగరు ప్రశాంత్‌కి నచ్చిందట.. అందుకే సలార్‌లో తీసుకున్నాడు!
on Dec 27, 2023
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మీడియా ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటిన ‘సలార్’ ఫుల్ రన్‌లో తప్పకుండా వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ధీమాగా చెబుతున్నారు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన శ్రీయారెడ్డి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తోంది. తాజాగా ‘సలార్’లో రాధారమ క్యారెక్టర్ సినిమాకి ఓ హైలైట్‌గా నిలిచింది. ఈ పాత్ర శ్రీయారెడ్డి చేయడం వెనుక ఒక కథ ఉంది. ఈ సినిమా ప్రపోజల్‌ను శ్రీయా దగ్గరకి తీసుకెళ్లినపుడు ప్రశాంత్‌కి నో చెప్పిందట. ఆ టైమ్‌లో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయి ఉందట. అయినా ప్రశాంత్ మాత్రం నటించాల్సిందేనంటూ పట్టుపట్టాడట. స్క్రిప్ట్ విన్న తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్పాడట. హీరో ఎవరైనా ఫర్లేదుగానీ తన క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉండాలని ముందుగానే కండీషన్ పెట్టిందట. ‘నీ రోల్ చాలా బాగుంటుంది. నా మీద నమ్మకం ఉంచు’ అని ప్రశాంత్ చెప్పడంతో ఓకే చెప్పిందట. నిజానికి ఒరిజినల్ స్క్రిప్ట్‌లో రాధారమ క్యారెక్టరే లేదట. ఆ తర్వాత సినిమాలో ఓ లేడీ విలన్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని భావించిన ప్రశాంత్ ఈ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశాడు. విలనిజం టచ్ ఉంటూనే అందంగా కనిపించేలా రాధా రమ పాత్రను డిజైన్ చేసుకున్నాడట. అసలు ఈ సినిమా కోసం తనను పట్టుపట్టి మరీ ఒప్పించడానికి కారణం తాను నటించిన ‘పొగరు’ సినిమా అని అసలు విషయాన్ని వెల్లడిరచింది శ్రీయారెడ్డి విశాల్ హీరోగా వచ్చిన ‘పొగరు’ చిత్రంలో శ్రీయారెడ్డి నటనకు అప్పట్లో మంచి అప్లాజ్ వచ్చింది. ఒక విధంగా ఆ సినిమా సూపర్‌హిట్ అవ్వడానికి శ్రీయారెడ్డి కూడా ఒక కారణం అని చెప్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



