రాజేంద్రప్రసాద్ కూతురి మరణంపై పర్సనల్ సెక్రటరి కీలక వ్యాఖ్యలు..సర్జరీ అనేదే జరగలేదు
on Oct 5, 2024
ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)కుమార్తె శ్రీమతి గాయత్రి(gayatri)హఠాన్మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.చిరంజీవి,వెంకటేష్, అల్లు అర్జున్,త్రివిక్రమ్, నాగ్ అశ్విన్ అనిల్ రావిపూడి, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, రేలంగి నరసింహారావు, నాగ్ అశ్విన్, రఘుబాబు, సాయికుమార్, శివాజీ రాజా వంటి ప్రముఖులు గాయత్రీ భౌతిక దేహాన్ని సందర్శించి రాజేంద్ర ప్రసాద్ కి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.పవన్‌కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున,ఎన్టీఆర్‌లతోపాటు మరికొందరు సోషల్ మీడియాద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఇక గాయత్రి మరణంపై రాజేంద్రప్రసాద్ దగ్గర ముప్పై సంవత్సరాలుగా పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న నాగరాజు పలు విషయాలని వెల్లడి చేసాడు. మూడు రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ గా ఉందని గాయత్రి చెప్పడంతో హాస్పిటల్ లో చూపించాం. దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. కానీ మళ్ళీ ఎక్కువగా రావడంతో నొప్పిని భరించడం నా వాళ్ళ కాదని గాయత్రి చెప్పడంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.డాక్టర్స్ చెక్ చేసి గ్యాస్ ట్రబుల్ తో పాటు కార్డియార్డిక్ అటాక్ అయ్యిందని, మల్టిపుల్ ఆర్గానిక్స్ ప్రాబ్లమ్ కూడా వచ్చిందని చెప్పారు. దాదాపుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట దాకా ట్రీట్ మెంట్ చేసారు. కానీ పరిస్థితి చేయిదాటిపోవడంతో చనిపోయింది.
గాయత్రికి ఫస్ట్ నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఒంటి మీద చిన్న సర్గరీ కూడా లేదు.ఎవరు ఊహించని విధంగా సడన్ గా చనిపోయింది.బంధువులందరికి విషయం చెప్తుంటే వాళ్ళు కూడా మొదట నమ్మలేదు.గాయత్రి న్యూట్రిషియన్ డైటీషియన్ చేసిందని చుట్టు పక్కల వారికి అందుకు సంబంధించిన సలహాలు కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు.
Also Read