యూట్యూబర్ హర్ష సాయికి కోలుకోలేని దెబ్బ..లుక్ అవుట్ నోటీసులు జారీ
on Oct 5, 2024
మాజీ బిగ్ బాస్ నటి మీద లైంగిక దాడి జరపడంతో పాటు డబ్బుల్ని కాజేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయి(harsha sai)మీద కొన్ని రోజుల క్రితం పోలీసు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.కానీ ఇంతవరకు హర్ష సాయి ఆచూకీ మాత్రం ఎవరకి తెలియలేదు.దీంతో హర్ష సాయి విదేశాలకీ పారిపోయాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత యువతీ ఈ విషయాన్నీ పోలీసులకి తెలియచేసింది.
దీంతో హర్షసాయి విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు.రెండు వారాలుగా పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న హర్షసాయి కి ఇప్పుడు ఈ నిర్ణయం షాక్ ని కలిగించడం గ్యారంటీ. ఇదిలా ఉండగా ఇప్పటికే హర్షసాయి తండ్రి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.దీని మీద కూడా తీర్పు రావాల్సి ఉంది.
ఇక హర్షసాయి వ్యవహారంపై బాధిత యువతీ లాయర్ పలు కీలక వ్యాఖ్యలు చేసాడు. హర్ష సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తు యువతి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొనగా మరోవైపు హర్షసాయి మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Also Read