రాజమౌళిపై అది ఒట్టి పుకారే!
on Dec 19, 2016
బాహుబలి తరవాత రాజమౌళి బాలీవుడ్ వెళ్లిపోతాడని, అక్కడో సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. రాజమౌళి దృష్టి అమీర్‌పై పడిందని.. ఈ రికార్డుల రారాజుతో ఓ సినిమా చేయడం ఖాయమని చెప్పుకొన్నారు. `మహాభారతం` కథని సినిమాగా చేయాలని అమీర్, రాజమౌళి ఫిక్సయ్యారని వార్తలు బలంగా వచ్చాయి. అయితే ఇదంతా ఒట్టి పుకారే అని తేలిపోయింది. `రాజమౌళి మహాభారతం సినిమా చేస్తున్నారట కదా` అని అమీర్‌ఖాన్‌ని అడిగితే.. `ఆయన మహాభారతం చేస్తున్నారా? నాకు తెలీదే.. నిజమేనా` అంటూ ప్రశ్న అడిగిన పాత్రికేయుల్నే అమీర్ గుచ్చి గుచ్చి అడిగాడు. అంటే.. మహాభారతం మేటర్ అమీర్ ఖాన్ వరకూ వెళ్లలేదనే కదా. మీడియా మాత్రం అమీర్ - రాజమౌళి మధ్య మాటలు అయిపోయాయని, సినిమా సెట్స్ పైకి వెళ్లడమే బాకీ అన్నట్టు వార్తలు సృష్టించింది. అమీర్ సమాధానంతో రాజమౌళిపై వచ్చింది కేవలం రూమరే అని తేలిపోయింది. అయితే అమీర్ మాత్రం `ఒకవేళ రాజమౌళి మహాభారతం తీస్తే నేను శ్రీకృష్ణుడిగా నటించడానికి మొగ్గు చూపుతా` అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది కాస్త జక్కన్నకు ఊరట కలిగించేదే. ఎందుకంటే `మహాభారతం` సినిమాని పెద్ద ఎత్తున తీయాలని రాజమౌళి ఫిక్సయ్యాడు. అందులో బాలీవుడ్ యాక్టర్స్‌నీ ఇన్‌వాల్వ్ చేయాలనుకొన్నాడు.రాజమౌళి ప్లాన్ గనుక వర్కవుట్ అయితే శ్రీకృష్ణుడిగా అమీర్‌ఖాన్‌ని చూసేయొచ్చు.