వాట్ ఈజ్ దిస్ కుమ్ముడు... దేవిశ్రీ ప్రసాద్
on Dec 19, 2016
డీఎస్‌పీ అంటే ఓ సంగీత సంచలనం. మాస్, బీట్, మెలోడీ, ఇంట్రడక్షన్‌సాంగ్, ఐటెమ్ సాంగ్ ఇలా ప్రతీదాంట్లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేయగలడు. కేవలం తన పాటలతోనే సినిమాల్ని హిట్ చేసిన ఘనత దేవిశ్రీ కి ఉంది. మెగా ఫ్యామిలీకి డీఎస్‌పీ సంగీతం బాగా అచ్చొచ్చింది.చిరు, పవన్, చరణ్, బన్నీ... ఇలా మెగా హీరోలందరికీ సూపర్ హిట్స్ ఇచ్చాడు డీఎస్‌పీ. చిరు 150వ సినిమా ఖైదీ నెం.150కీ దేవినే సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని `అమ్మడు.. కుమ్ముడు` అనే పాటని ఆన్‌లైన్‌లో ఉంచారు. ఈ పాట విన్నవాళ్లంతా ముక్కుమీద వేలేసుకొంటున్నారు. ఇది డీఎస్‌పీ పాటేనా? అనుకొంటున్నారు. డీఎస్‌పీ చేసిన ఎన్నో పాటల్ని అమ్మడు - కుమ్ముడు కాపీ కొట్టినట్టు అనిపిస్తోంది.
స్వయంగా దేవినే రాసిన లిరిక్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. చిరు సినిమా స్థాయిలో ఈ పాట లేదని, డీఎస్‌పీ తన దగ్గరున్న వేస్ట్ ట్యూన్‌ని, ఎవరూ తీసుకోని ట్యూన్‌నీ ఈ సినిమా కోసం వాడేశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి పాటే ఇలా ఉంటే.. ఇక ఆల్బమ్‌లో మిగిలిన పాటల సంగతేంటని? మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈమధ్య దేవి పాటల్లో లయ తప్పిందని, తను కూడా బోరింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడని సంగీత అభిమానులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ విమర్శలు ఈ ఒక్కపాటకే పరిమితమైతే అదే పది వేలు. మిగిలిన పాటలూ ఇవే రేంజులో ఉంటే... మెగా ఫ్యాన్స్ తమ విమర్శల దాడిని పెంచేయడం ఖాయం. బీకేర్‌ఫుల్ దేవిశ్రీ.