తెలుగులో అమీర్‌కు ఇష్టమైన హీరోలు ఇద్దరే..!
on Dec 19, 2016
కథ నచ్చితే ఎంత దాకా అయినా వెళ్లే హీరోల్లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ముందు వరుసులో ఉంటారు. అందుకు ఎన్నో సినిమాలు మనకు ఉదాహరణగా నిలుస్తాయి. సినీ పరిశ్రమ బౌండరీలు దాటిన ప్రస్తుత రోజుల్లో హీరోలు తమ ఇండస్ట్రీని దాటి పక్క ఇండస్ట్రీల సినిమాల్లోనూ నటిస్తున్నారు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లయినా బాలీవుడ్‌ను దాటి మరో భాషా చిత్రంలో నటించలేదు. కానీ మంచి పాత్ర దొరికితే తెలుగులో నటిస్తానని మనసులోని మాటను బయట పెట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిన దంగల్ సినిమా త్వరలో విడుదల కానుంది..దాని ప్రమోషన్‌లో భాగంగా అమీర్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగులో నటించాల్సి వస్తే ఎవరితో నటిస్తారు అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు..మరో మాట లేకుండా చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అనే చెప్పేశారు. వారిద్దరి నటన తనకు ఇష్టమని..వీళ్లతో పనిచేసే అవకాశం వస్తే ఆ ఛాన్స్ మిస్సవ్వను అని చెప్పారు.