మహేష్ బాబు కారుకి చలానాలు విధించిన పోలీసులు!
on Nov 15, 2025

-మహేష్ ఫ్యాన్స్ హంగామా
-మహేష్ కారుకి చెలనాలు
-ssmb 29 ఎలా జరగబోతుంది
-ఏం చెప్పబోతున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)అభిమానుల కోలాహలంతో రామోజీ ఫిలింసిటీకి వెళ్లే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ssmb 29 సభావేదిక ప్రాంగణమైతే ఇప్పటికే అభిమానులతో నిండి పోయింది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మరి కాసేపట్లో మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా తో పాటుచిత్ర యూనిట్ సభాస్థలికి చేరుకోనుంది. మహేష్, రాజమౌళి తో పాటు మిగతా వాళ్లంతా మూవీ గురించి ఎలాంటి వివరాలని వెల్లడి చేస్తారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
also read: కాంత ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కొట్టారా!
సోషల్ మీడియా వేదికగా కూడా మహేష్ అభిమానులు హంగామా మాములుగా లేదు.ssmb 29భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకి మహేష్ కారుకి సంబంధించిన చలానా ఒకటి కంటపడింది. హైదరాబాద్(Hyderabad)ట్రాఫిక్ పోలీసులు మహేష్ కారుకి రెండు చెలానాలు విధించారు.సదరు కారు నెంబర్ టిఎస్36ఎన్ 4005 . ఆ రెండు చెలనాలని పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, పివిఎన్ఆర్ ఫ్లై ఓవర్ పై విధించారు. అక్టోబర్ 4 ,అక్టోబర్ 17 డేట్స్ ఉన్నాయి. మొత్తం అమౌంట్ రెండు వేల డెబ్భై రూపాయలు. ఇప్పుడు ఈ చెలనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



