అహ నా పాయల్... పేపర్ చిరిగితే?
on Apr 23, 2020
'అహ నా పెళ్ళంట!' సినిమా చూశారా? మెజారిటీ తెలుగు ప్రేక్షకులు చూసే ఉంటారు. అందులో సన్నివేశాలు గుర్తు ఉన్నాయా? ప్రేమించిన అమ్మాయి తండ్రి అయిన కోట శ్రీనివాసరావును ఆకట్టుకోవడానికి హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో దుస్తులు వేసుకోవడం మానేసి ఒంటికి పేపర్ చుట్టుకుంటాడు. కట్ చేస్తే... ప్రస్తుతానికి వద్దాం!
'ఆర్ఎక్స్ 100' ఫేమ్, హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ బుధవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే... 'అహ నా పెళ్ళంట!'లో రాజేంద్రప్రసాద్ డ్రస్ గుర్తుకు వస్తుంది. అయితే... ప్రేమించిన అబ్బాయినో, వాళ్ళ ఫ్యామిలీనో ఇంప్రెస్ చేయడానికి పాయల్ పేపర్ డ్రస్ వేసుకోలేదు. జస్ట్... లాక్‌డౌన్‌లో ఖాళీగా ఇంటిలో ఉండడంతో ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు. అందాలన్నీ ప్రేక్షకులకు కనిపించకుండా కేవలం పేపర్ మాత్రమే అడ్డుపెట్టుకున్నారు. ఇంతకు ముందు ఇదే విధంగా అందాలకు పిల్లో అడ్డుపెట్టుకుని ఫొటోలు దిగి పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఒకవేళ ఈ పేపర్ చిరిగితే పరిస్థితి ఏంటి? అని కొందరికి ధర్మ సందేహం వచ్చింది. ఈ డ్రస్ వేసుకొని బయటకు వస్తారా? ఏంటి? ఏదో సరదాకి ఇంట్లో వేసుకొన్నారు కానీ! అన్నట్టు... ఈ డ్రస్ డిజైన్ చేసినదీ, ఫొటోలు తీసినదీ తన స్నేహితుడు సౌరభ్ అని పాయల్ పేర్కొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
