రెంట్ భరించలేక సెట్ కూలుస్తున్నారా?
on Apr 24, 2020
'దేవదాస్' మొదలుకుని 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' వరకూ ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తీసిన సినిమాలు ఏవి చూసుకున్నా భారీగా ఉంటాయి. సినిమాల కోసం ఆయన భారీ భారీ సెట్స్ వేస్తారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో ఆయన ప్రకటించిన 'గంగూబాయి కతియావాడీ' కోసం కూడా ముంబై మహానగరంలోని స్టూడియోల్లో భారీ సెట్స్ వేశారు. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. కరోనా అడ్డు పడింది. ఒక నెల లేదంటే రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయి అనుకోని సెట్స్ అలాగే ఉంచారు. రెంట్ కూడా పే చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ పరిస్థితులు ఎప్పటికి నెలకొంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని నెలలు రెంట్ కట్టడం కంటే సెట్స్ కూల్చేయడం మంచిదని సంజయ్ లీలా భన్సాలీ డెసిషన్ తీసుకున్నారట. సెట్ వేయడానికి అయిన ఖర్చు కంటే స్టూడియోకి కట్టే రెంట్ ఎక్కువ అవుతుండడంతో ఆయన సెట్స్ తీసేయడానికి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం ముంబై సినిమా సర్కిల్స్ లో హాట్ టాపిక్ ఇది. అయితే... సంజయ్ లీలా భన్సాలీ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఆయన సెట్స్ తీసేసినా... అదే స్టూడియోలో ఇంకొకరు సెట్స్ వేసుకొని షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. అయితే... స్టూడియో ఓనర్లు రెంట్ అడిగితే తీసేయక ఏం చేస్తారు చెప్పండి!?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
