‘లక్ష్మీస్ ఎన్టీయార్’ లో చంద్రబాబు ఎవరో తెలుసా?
on Oct 25, 2017
గడ్డం ఉన్నంత మాత్రాన చంద్రబాబు కేరక్టర్ చేసేస్తారా? తీసేవాడికీ విలువలు లేవు.. చేసే వాడికీ సంస్కారం లేదు. ఇది తెలుగు దేశం నాయకుల మాటలు. ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా? ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ సినిమాలో చంద్రబాబు పాత్ర చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు జేడీ చక్రవర్తిని వర్మ ఫిక్స్ చేసినట్లు వర్మా అండ్ కంపెనీ సమాచారం. ఇందులో నిజం ఎంత? అనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కనపెడితే... ఇటీవల లక్ష్మీపార్వతి ఇంటికెళ్లి.. అపాంట్మెంట్ కూడా తీసుకున్నాడు జేడీ. ఈ కథ గురించి ఆమెతో త్వరలోనే వర్మ, జేడీ చర్చించనున్నారు. దాంతో.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’లో జేడీ కూడా నటిస్తున్నట్లు.. పైగా చంద్రబాబు పాత్ర చేయనున్నట్లు వార్తలు వెలుగుచూశాయ్. పైగా వర్మ సినిమా అంటే.. జేడీ ఎన్వాల్వ్ మెంట్ ఎక్కువే ఉంటుంది. అది కూడా ఈ వార్తకు ఓ కారణం కావొచ్చు. అయితే.. అసలు విషయాన్ని వర్మ తేల్చి చెప్పేశాడు.
‘లక్ష్మీ ఎన్టీయార్’లో జేడీ చేయడం లేదు. తాను చంద్రబాబు పాత్ర చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఈ కథ గురించి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయ్. అందుకే ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నాను. ఎన్టీయార్ పదవీచ్యుతుడ్ని చేసినప్పుడు వైస్రాయ్ హోటల్ లో ఏం జరిగింది? అనే విషయాలు నాకు తెలీదు. ఆ సమాచారం అంతా సేకరించిన తర్వాత అసలు పని మొదలుపెడతా’ అని వివరంగా చెప్పుకొచ్చాడు వర్మ.
సో... ఇందుమూలంగా అర్థమయ్యిందేంటి? ఇందులో చంద్రబాబు పాత్రను జేడీ చేయడంలేదన్నమాట. ఎన్టీయార్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు, హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, మోహన్ బాబు.. ఈ కథలో కీలక పాత్రధారులు. మరి ఆ పాత్రలను ఎవరు చేస్తారో చూడాలి.