'మన్మథుడు 2' ఫ్లాపైనా...
on Nov 13, 2019
'చిలసౌ'తో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారాడు. హీరో హీరోయిన్ల పాత్రలను తీర్చిదిదిన విధానం, దర్శకత్వం వహించిన తీరు, సినిమాలో వినోదం అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి. దర్శకుడిగా రాహుల్ రెండో సినిమా 'మన్మథుడు 2' ఆ పేరును తుడిచిపెట్టేసింది. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తీసిన విధానం చాలా మందికి నచ్చలేదు. ఝాన్సీ, రకుల్ లిప్ లాక్ సీన్స్ నుండి నాగార్జునను ప్లేబాయ్ గా చూపించిన సీన్స్ వరకు చాలా సన్నివేశాలపై ఇంటర్‌నెట్‌లో ట్రోల్స్ వచ్చాయి. 'మన్మథుడు 2' ప్లాప్ తర్వాత అతడికి ఇప్పట్లో మరో అవకాశం రాదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.
'మన్మథుడు 2' ఫ్లాపైనా... రాహుల్ రవీంద్రన్ టాలెంట్‌పై నేచురల్ స్టార్ నమ్మకం ఉంచాడట. ఇటీవల అతడు చెప్పిన కథను నాని ఒకే చేశాడట. సాధారణంగా ఓ సినిమా షూటింగ్ స్టేజిలో ఉండగా, నెక్స్ట్ సినిమాను నాని ప్రకటిస్తాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' చేస్తున్నాడు. కానీ, నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పలేదు. మ్యాగ్జిమమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని టాక్. లేదంటే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. 'నిన్ను కోరి'తో నానికి శివ నిర్వాణ మంచి హిట్ ఇచ్చాడు. తర్వాత అతడు చేసిన 'మజిలీ' నాగచైతన్య కెరీర్లో భారీ కమర్షియల్ సక్సెస్. సో... నాని, శివ నిర్వాణ సినిమా చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. ఇవి కాకుండా కొత్త దర్శకులు చెప్పే కథలను కూడా నాని వింటున్నారట.
Also Read