మార్నింగ్ షోస్‌కు 'పుష్ప' ఆక్యుపెన్సీ ఇదే!
on Dec 17, 2021

అంబరాన్నంటిన అంచనాల మధ్య అల్లు అర్జున్ 'పుష్ప' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా, సునీల్, అజయ్ ఘోష్ విలన్లుగా నటించిన ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. తెలుగు సహా ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజయ్యింది. తెలుగు చిత్రసీమలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన 'పుష్ప'ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. నిన్న విడుదలైన హాలీవుడ్ ఫిల్మ్ 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్'కు పాజిటివ్ టాక్ రావడంతో దాన్ని ఎదుర్కోవడం 'పుష్ప' ముందున్న అతిపెద్ద సవాలు. అయితే తెలుగు వెర్షన్ వచ్చిన ధాటికి బాక్సాఫీస్ దడదడలాడిపోయింది.
Also read: 'పుష్ప' మూవీ రివ్యూ
ట్రేడ్ రిపోర్టుల ప్రకారం 'పుష్ప'కు తెలుగు వెర్షన్ మార్నింగ్ షోస్‌కు 80 నుంచి 85 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. అలాగే హిందీ వెర్షన్‌కు మార్నింగ్ షోలకు 23 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీ, తమిళ వెర్షన్‌కు 20 నుంచి 23 శాతం థియేటర్లు నిండాయి. అందిన సమాచారం ప్రకారం 'పుష్ప' తొలిరోజు వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. రేపు ఉదయం నాటికి కలెక్షన్ ఎంతనేది వెల్లడి కానున్నది. 'పుష్ప' తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలయ్యింది.
Also read: 'పుష్ప' టికెట్ల కోసం మహా డిమాండ్! ఇటీవలి కాలంలో ఈ రేంజ్ క్రేజ్ చూడలేదు!
కాగా, తన సినిమాను 'ఆర్ఆర్ఆర్' డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్ ఇవ్వడంపై ఇటీవల అల్లు అర్జున్ తన ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పటికే పలు రకాల జానర్ మూవీస్‌తో ఆకట్టుకున్న బన్నీ, తొలిసారిగా 'పుష్ప'గా పాన్ ఇండియా సబ్జెక్టుతో మన ముందుకు వచ్చాడు. హిందీ వెర్షన్‌కు ప్రమోషన్స్ బాగా చెయ్యాలని రాజమౌళి సూచించడంతో, సరేనని చెప్పాడు బన్నీ. హిందీలో తమ టీమ్ కాస్త ఆలస్యంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిందని అంగీకరించిన అతను, నిన్న ముంబైలో మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



