డిసెంబర్ 31.. 4 డిఫరెంట్ జోనర్ మూవీస్!
on Dec 17, 2021

కరోనా ఎఫెక్ట్ ఎలా ఉన్నా.. వారం వారం వినోదానికి ఢోకా లేకుండాపోతోంది సినీ ప్రియులకు. ఒకవైపు ఓటీటీలో.. మరోవైపు థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తూ ప్రేక్షకులకు బాగానే ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే.. ఈ డిసెంబర్ 31న కూడా నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో మూడు స్ట్రయిట్ మూవీస్ కాగా.. ఒకటి తమిళ డబ్బింగ్. అంతేకాదు.. ఇవన్నీ కూడా విభిన్న తరహా చిత్రాలే కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన పిరియడ్ డ్రామా `1945` డిసెంబర్ 31న జనం ముందుకు రానుంది. అలాగే అదే రోజున కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటించిన `గుడ్ లక్ సఖి` తెరపైకి వస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కీర్తి షూటర్ గా దర్శనమివ్వనుంది. ఇక అదే డిసెంబర్ 31న శ్రీ విష్ణు నటించిన `అర్జున.. ఫాల్గుణ..` రిలీజ్ కానుంది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని బజ్. అదే విధంగా.. ఆర్య, రాశీ ఖన్నా జంటగా నటించిన కోలీవుడ్ కామెడీ హారర్ `అరణ్మణై 3` తెలుగులో `అంతఃపురం` పేరుతో ఏడాది చివరి రోజే విడుదలకు సిద్ధమైంది.
మరి.. 2021 చివరి రోజైన డిసెంబర్ 31న రాబోతున్న ఈ నాలుగు విభిన్న చిత్రాల్లో వేటికి జనాదరణ దక్కుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



