'పుష్ప' టికెట్ల కోసం మహా డిమాండ్! ఇటీవలి కాలంలో ఈ రేంజ్ క్రేజ్ చూడలేదు!
on Dec 16, 2021

సెకండ్ లాక్‌డౌన్ తర్వాత వచ్చిన సినిమాల్లో థియేటర్ల దగ్గర ప్రేక్షకుల జాతరను తీసుకొచ్చిన ఫస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది బాలకృష్ణ టైటిల్ రోల్ చేసిన 'అఖండ'. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేయడమే కాకుండా, బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇలా టాలీవుడ్‌కు ఊపునిచ్చిన సినిమాగా పేరు తెచ్చుకుంది 'అఖండ'. ఇప్పుడు దానికి మించిన పిచ్చ క్రేజ్‌తో అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' రేపు రిలీజవుతోంది. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రిలీజవుతున్నప్పటికీ, తెలుగునాట పోలిస్తే మిగతా ప్రాంతాల్లో 'పుష్ప'కు ఆశించిన రీతిలో మేకర్స్ ప్రమోషన్స్ చేయలేకపోయారు.
Also read: తెలుగు రాష్ట్రాల్లో రూ. 101 కోట్లు.. 'పుష్ప' బిజినెస్ క్రేజ్!
ఏదేమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' మొదటిరోజు మొదటి ఆట చూడ్డానికి ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మార్నింగ్ షో టికెట్లు అయిపోవడంతో వేలాది మంది నిరాశచెందారు. ఈ నేపథ్యంలో తమ పరపతి ఉపయోగించి టికెట్లు తెచ్చుకోవడానికి పొలిటీషియన్లు, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. థియేటర్ల ఓనర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమకోసం కొన్ని టికెట్లు ఉంచాల్సిందిగా పెద్దవాళ్ల నుంచి వస్తున్న కాల్స్‌తో ఓనర్లు, మేనేజర్లు తలలు పట్టుకుంటున్నారు.
Also read: 'పుష్ప'ను సరిగా ప్రమోట్ చెయ్యమంటూ బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
ఆన్‌లైన్‌లో ఫస్ట్ డే టికెట్లు అమ్ముడుపోవడంతో తాము చేయగలిగింది ఏమీ లేదని వారికి తెలుసు. అందుకే పలువురు థియేటర్ల మేనేజర్లు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్లు అన్నింటిలోనూ మొదటిరోజు టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. ఈమధ్య కాలంలో ఒక సినిమా టికెట్లకు ఇలాంటి డిమాండ్ కనిపించడం చూడలేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. సినిమా రిలీజయ్యాక బాగుందనే టాక్ బయటకు వస్తే.. టికెట్లకు గిరాకీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



