Home

»

Latest News

పుష్ప పార్ట్-2 టైటిల్ వచ్చేసింది!

Dec 17, 2021

'తగ్గేదేలే' అంటూ కొంతకాలంగా హడావిడి చేస్తున్న పుష్ప రాజ్ నేడు(డిసెంబర్ 17 న) థియేటర్స్ లో అడుగుపెట్టాడు. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ 'పుష్ప ది రైజ్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి.. పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్ చేసి మరింత కిక్ ఇచ్చింది మూవీ టీమ్.

Also Read: బన్నీ ఫ్యాన్స్ కి ఊహించని షాక్​!

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లే నేడు విడుదలైన పుష్ప పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తగ్గేదేలే అంటూ థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. మరోవైపు అప్పుడే పుష్ప సెకండ్ పార్ట్ గురించి కూడా ఆడియన్స్ లో చర్చలు మొదలయ్యాయి. ఇంతవరకు సెకండ్ పార్ట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వని మూవీ టీమ్.. పార్ట్ 1 ఎండింగ్ లో టైటిల్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది. పుష్ప పార్ట్ 2 కి 'పుష్ప ది రూల్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

Also Read: 'పుష్ప'.. ఇటీవ‌లి కాలంలో ఈ రేంజ్‌ క్రేజ్ చూడ‌లేదు!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన 'పుష్ప'లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఫహాద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com