Home

»

Latest News

బన్నీ ఫ్యాన్స్ కి ఊహించని షాక్.. 'పుష్ప' మలయాళ వెర్షన్ విడుదల వాయిదా!

Dec 17, 2021 10:28AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాని వరుస సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదటి హిందీ విడుదల విషయంలో సమస్యలు తలెత్తాయి. ఆ తరువాత కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ థియేటర్స్ విడుదల చేస్తున్నారంటూ.. గురువారం నాడు బాయ్ కాట్ పుష్ప అంటూ కన్నడిగులు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇక కేరళలో అసలు సినిమానే వాయిదా పడి బన్నీ ఫ్యాన్స్ కి షాక్ పెద్ద షాక్ తగిలింది.

Also Read: 'పుష్ప' కోసం శేషాచ‌లం ఎర్ర‌చంద‌నాన్ని మారేడుమిల్లి అడ‌వుల్లో సృష్టించింది ఈ జంటే!

బన్నీకి మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ బన్నీ సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తుంటాయి. బన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం అక్కడి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే విడుదలకు కొన్ని గంటల ముందు మలయాళ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక సమస్యల కారణంగా పుష్ప మూవీ మలయాళ వెర్షన్ ఫైనల్ కాపీ సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఆడియో సింక్ లో తలెత్తిన సమస్యల సినిమాను వాయిదా వేసినట్లు సమాచారం.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో రూ. 101 కోట్లు.. 'పుష్ప' బిజినెస్ క్రేజ్‌!

కేరళలో మలయాళ వెర్షన్ ని ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. శనివారం(డిసెంబర్ 18) మలయాళ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అయితే కేరళలో తమిళ వెర్షన్ మాత్రం శుక్రవారమే విడుదల అని పేర్కొన్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com