'గాడ్సే' టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్.. 'బ్లఫ్ మాస్టర్' మ్యాజిక్ రిపీట్ కానుందా!
on Dec 20, 2021

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'బ్లఫ్ మాస్టర్'. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ నటనకి, మూవీలో సీన్స్ కి చప్పట్ల వర్షం కురిసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. 'గాడ్సే' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది.
"ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు" అంటూ అప్పట్లో కమ్యూనిస్ట్ లీడర్ లెనిన్ చెప్పిన డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. పవర్ ఫుల్ డైలాగ్స్, బ్యూటిఫుల్ విజువల్స్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సేవ పేరుతో వేల, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్న అవినీతి రాజనీయనాయకులపై ఓ వ్యక్తి చేసే పోరాటమే 'గాడ్సే' సినిమా అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. బ్లఫ్ మాస్టర్ తో అలరించిన సత్యదేవ్- గోపి గణేష్ కాంబో 'గాడ్సే'తోనూ అలరిస్తారేమో చూడాలి.
సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న 'గాడ్సే'లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నాగబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



