డీజే కాపీ కొట్టిన సినిమా ఏంటో తెలిసిపోయింది
on Mar 2, 2017
అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ గా కనిపించబోతున్నాడని, అందులో బన్నీ ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో తెరపై సందడి చేస్తాడని తెలియగానే... అది కచ్చితంగా అదుర్స్‌కి కాపీనే అనుకొన్నారంతా. అదుర్స్‌లో ఎన్టీఆర్ కూడా బ్రాహ్మణ యువకుడిగా నటించాడు. డీజేకీ, అదుర్స్‌కీ ఒకే ఒక్క తేడా. అదేంటంటే డీజేలో బన్నీ సింగిలే.. అదుర్స్‌లో డబల్ రోల్. అది తప్ప కథ, కథనాల్లో పెద్దగా తేడా లేదని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే ఇప్పుడు మరో హాటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. డీజే కాపీ కొట్టింది అదుర్స్ సినిమాని కాదట. అర్జున్ నటించిన జెంటిల్‌మెన్ సినిమా అట. అర్జున్ - శంకర్ కాంబోలో వచ్చిన జెంటిల్‌మెన్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. సంచలన విజయం సాధించింది. ఆ సినిమాని హిందీలో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. డీజే కథకూ జెంటిల్ మెన్ కథకూ లింకులు ఉన్నాయట.
ఈ రెండు సినిమాల్లోనూ హీరో బ్రాహ్మణుడే. పల్లెటూర్లో బ్రాహ్మణుడిగా సంప్రదాయ బద్దంగా, అందరి కంటికి మంచి వాడిలా కనిపిస్తూ.. అప్పుడప్పుడూ పట్నం వెళ్లి దొంగతనాలు చేసి వస్తుంటాడు. ఆ సంపద కాలేజీలు కట్టించడానికి కేటాయిస్తాడు. డీజేలో కూడా సరిగ్గా ఇలాంటి సన్నివేశాలే ఉన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. సో.. బన్నీ కాపీ కొట్టింది అదుర్స్‌ని కాదన్నమాట. జెంటిల్‌మెన్ ని అన్నమాట. మరి ఈ కాపీ పేస్ట్ వల్ల ఎలాంటి ఫలితం సాధిస్తాడో చూడాలి.