పవన్ కోసం ఆ హీరోయిన్ అంత త్యాగం చేసిందా..?
on Oct 19, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన కనీసం ఒక్కసారైనా నటించాలని ప్రతి హీరోయిన్ కోరిక. అయితే కొందరికి కెరిర్ స్టార్టింగ్‌లోనే ఆ భాగ్యం దక్కగా..మరి కొందరికి ఏళ్లు గడుస్తున్నా వారిపై పవన్ కనికరం చూపడం లేదు. ఆ జాబితాలో సౌత్ టాప్ హీరోయిన్ నయనతార కూడా ఉంది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం గడుస్తున్నా నయన్‌కు ఇంతవరకు పవన్ పక్కన నటించే ఛాన్స్ రాలేదు. తాజాగా స్టార్ ప్రోడ్యూసర్ ఏఎం రత్నం ఈ జంటను కలిపేందుకు రెడీ అయ్యాడు. సూర్యా మూవీస్ బ్యానర్‌పై నీసన్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాలో నయన్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్సయ్యారట.
ఈ వార్త తెలియగానే నయనతార ఎగిరిగంతేసిందట. అంతేకాదు ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ చేయని త్యాగం చేసిందట. మామూలుగా ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం సినిమాకు మూడు కోట్లు తీసుకుంటోంది నయనతార. ఈ మధ్యే ఓ తమిళ నిర్మాత ఈ కేరళ కుట్టికి ఏకంగా 4 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో కేవలం పవన్‌తో సినిమా చేయాలని మూడు కోట్లు వదులుకోని కోటిన్నర రెమ్యునరేషన్‌కే నటిస్తోంది నయన్. అదే కనుక నిజమైతే నయనతార గ్రేటే.