Home

»

Latest News

ఆదర్శ కుటుంబంపై పూజిత పొన్నాడ షాకింగ్ మాటలు: నిజగానే అన్యాయం జరిగిందా!

Nov 19, 2026 2:57PM

పూజిత పొన్నాడ..అచ్చ తెలుగు హీరోయిన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో పూజిత అనే కట్ అవుట్ ఒకటుందని నిరూపించుకుంది. సోలో హీరోయిన్ గాను కొన్ని సినిమాలు కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ  త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేశ్ ఆదర్శ కుటుంబం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి అసలు నిజం ఇదా అని ఊహించని షాక్ కి గురి చేసింది.

పూజిత పొన్నాడ తాను యూకేలో ఉన్న సమయంలో ఆదర్శ కుటుంబంకి సంబంధించిన  అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఆదర్శ కుటుంబం ప్రాజెక్ట్ గురించి చెప్పగానే, త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం వస్తోందన్న ఆనందంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్‌కి వచ్చేసింది. ఆడిషన్ ప్రక్రియ ద్వారా ఆమెను ఎంపిక చేశారని, త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పారని పూజిత తెలిపారు. అంతేకాదు, తొలి షెడ్యూల్‌లో ఆమెతో షూటింగ్ కూడా నిర్వహించారు.

అయితే అసలు సమస్య రెండో షెడ్యూల్ దగ్గర మొదలైంది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక సుమారు 3 నెలల పాటు రెండో షెడ్యూల్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదని పూజిత చెప్పారు. మధ్యలో విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉన్నందున, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన కరువైందని వాపోయారు. ఆ తర్వాత మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, ఆమెకు షూటింగ్ షెడ్యూల్ ఏదీ లేదని చెప్పారట.

ఇది కూడా చదవండి:ఈ నగరానికి ఏమైంది రిపీట్ హైలైట్స్ ఇవేనంట: హిట్టుని అందుకుందా!
 

దీనిపై పూజిత కారణం అడిగి స్పష్టత కోరగా, తన క్యారక్టర్ లోకి  మరో నటిని తీసుకున్నారని తెలిసి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు వెల్లడించారు. పద్ధతిగా ఆడిషన్ చేసి ఎంపిక చేసిన తర్వాత, కనీసం చెప్పకుండా తనను క్యారక్టర్ నుంచి తొలగించడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆమె అన్నారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆమెకు మరో పెద్ద షాక్ తగిలిందట.

థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ సన్నివేశంలో కేవలం ఒక  చిన్న సీన్‌లో, అది కూడా దాదాపు 40 సెకన్ల పాటు మాత్రమే కనిపించడం చూసి ఆశ్చర్యపోపోయింది. ఆమె చెప్పినట్టుగా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. పూజిత ఇలాంటి క్యారక్టర్ లో కనిపించటం ఏంటా అని! 

 

మీకు నచ్చవచ్చు :అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట!
మీకు నచ్చవచ్చు :విశ్వక్ సేన్ కొత్త మూవీ ఓటిటి డేట్ ఇదే: త్వరగానే కానిచ్చేశారు! 

 

[Pujita Ponnada,  Adarsha Kutumbam, Venkatesh, Trivikram, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com