హర్టయిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్.. ఫ్యాన్స్‌కు సారీ!
on Dec 21, 2021

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీ వాస్తవానికి జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఆ మూవీ విడుదలను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు. మలయాళం హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు ఇది రీమేక్. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన 'భీమ్లా నాయక్'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిజానికి గతంలో 'భీమ్లా నాయక్' సంక్రాంతి రేసు నుంచి తప్పుకొనే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పుడు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దీని గురించి ఆరాలు తీశారు. అలాంటిదేమీ లేదనీ, జనవరి 12నే తమ సినిమా విడుదలవుతుందనీ నాగవంశీ కుండబద్దలు కొట్టారు. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.
Also read: 'భీమ్లా నాయక్' కోసం ఫిబ్రవరిని త్యాగం చేసి ఏప్రిల్‌కు మారిన 'ఎఫ్3'
డిసెంబర్ 7న నాగవంశీ చేసిన మరో ట్వీట్ ఫ్యాన్స్‌ను మరింత ఆనందపర్చింది. "ఇప్పుడే 'భీమ్లా నాయక్' వీడియో రష్ చూశాను. గుర్తుంచుకోండి అబ్బాయిలూ, 2022 జనవరి 12న థియేటర్లలో మీరు రచ్చ రచ్చ చేస్తారు #BHEEMLANAYAKon12thJAN " అని ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.
Also read: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'భీమ్లా నాయక్'
కట్ చేస్తే.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' సినిమాలకు దారి వదులుతూ సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లా నాయక్' తప్పుకున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఈ మార్పు ఆఖరుకు నాగవంశీని కూడా హర్ట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' సినిమాల నిర్మాతలు పవన్ కల్యాణ్‌ను కలిసి, తమవి పాన్ ఇండియా సినిమాలు కావడంతో నార్త్ బెల్ట్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్స్‌ను నిర్ణయించాల్సి వచ్చిందనీ, 'భీమ్లా నాయక్' కూడా అప్పుడు వస్తే థియేటర్ల సమస్య రావడంతో పాటు, కలెక్షన్లపై కూడా దాని ప్రభావం పడుతుందనీ చెప్పారు. 'భీమ్లా నాయక్' కోసం తమ 'ఎఫ్3' మూవీ రిలీజ్ డేట్‌ను సమ్మర్‌కు మార్చుకోవడానికి దిల్ రాజు కూడా ముందుకు వచ్చారు. దీంతో ఇండస్ట్రీ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 'భీమ్లా నాయక్' విడుదల తేదీని ఫిబ్రవరికి మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
Also read: `భీమ్లా నాయక్`, `రాధే శ్యామ్`.. సేమ్ టు సేమ్!
ఏదేమైనా సంక్రాంతికి కచ్చితంగా వద్దామనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి రావడం నిర్మాత నాగవంశీని బాధపెట్టింది. ఈ విషయం ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి అర్థమవుతోంది. "అందరు అభిమానులకు క్షమాపణలు. సారీ, ఇది నా చేతుల్లో లేకుండా పోయింది. నేను మన హీరో పవన్ కల్యాణ్ గారి మాటల ప్రకారం నడుచుకోవాల్సి వస్తోంది. ఈ ఇండస్ట్రీ సంక్షేమానికి ఆయనెప్పుడూ కట్టుబడి ఉంటారని మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, ఈ శివరాత్రి, ఒక తుఫాను లాంటి శక్తి థియేటర్లలోకి వస్తుంది! #BheemlaNayakon25thFeb " అని ఆయన ట్వీట్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



