'స్పిరిట్' మూవీ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ కి ఇదే ఫస్ట్ టైం!
on Jan 4, 2022

'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను భూషణ్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. అయితే తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి ఓ కీలక విషయాన్ని రివీల్ చేశాడు.
'స్పిరిట్' మూవీ అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'స్పిరిట్'లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని రివీల్ చేశాడు. స్పిరిట్ గొప్ప చిత్రం అవుతుందని, ఇందులో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఇంతవరకు పోలీస్ పాత్రలో నటించలేదు. మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
అయితే స్పిరిట్ సినిమాకి ఇంకా చాలా సమయముందని భూషణ్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ k సినిమాలు ఉన్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి కూడా రణబీర్ కపూర్ తో 'యానిమల్' సినిమా చేయనున్నాడు. ఆ తర్వాతే స్పిరిట్ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
'ఆదిపురుష్' నిర్మాతగానూ వ్యవహరిస్తున్న భూషణ్ కుమార్ ఆ సినిమాకి సంబంధించిన విషయాలను కూడా లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని, ఈ సినిమా ప్రభాస్ కోసమే రూపొందించబడిందని అన్నాడు. ఈ సినిమాని 2022 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నామని భూషణ్ కుమార్ చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



