తారక్-చరణ్ స్నేహబంధం చూసి జెలసీ ఫీలవుతున్న మాధవన్!
on Jan 4, 2022

'ఆర్ఆర్ఆర్' మూవీలోని నాటు పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహబంధాన్ని చూసి స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్ అసూయపడుతున్నాడు. "నాటు నాటు" పాటను చూసి పూర్తిగా మైకంలో పడిపోయిన మ్యాడీ ట్విట్టర్‌లోకి వెళ్లి అదే విషయాన్ని తెలియజేశాడు. "I can get over this video.. it’s simply extraordinary ordinary." అని ట్వీట్ చేశాడు.
Also read: వంటలక్క మరిదిని బుట్టలో వేసిన మోనిత
అతను ఇంకా "జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మధ్య ఉన్న స్నేహం నాకు చాలా అసూయ కలిగిస్తుంది. నేను అసూయలో మునిగిపోతున్నాను. మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది-హాట్స్ ఆఫ్." అని రాసుకొచ్చాడు. RRR మేకర్స్ మాధవన్‌కి వెంటనే థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు.

"నాటు నాటు" సాంగ్ సోషల్ మీడియాను తుఫానులా చుట్టేసింది. అందులో తారక్, చరణ్ ఒకరినొకరు పట్టుకొని వేసిన స్టెప్‌ను ఫ్యాన్స్ రిక్రియేట్ చేస్తూ, ఆ రీల్స్‌ను షేర్ చేస్తున్నారు. కీరవాణి స్వరాలు కూర్చగా చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చాడు.
Also read: సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
కాగా, దేశంలో కొవిడ్ 19 కేసులు శరవేగంగా పెరుగుతుండటం, పలు ప్రాంతాల్లో థియేటర్లను మూసేస్తుండటంతో 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు పోస్ట్‌పోన్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



