పెళ్లి కుదుర్చుకున్న ప్రియమణి..!
on May 28, 2016
డస్కీ బ్యూటీ ప్రియమణి నిశ్చితార్ధం చేసుకుంది. అవకాశాలు తగ్గిపోవడంతో ఇక లైఫ్ లో సెటిల్ అవుదామని నిర్ణయించకున్న ప్రియమణి, గత కొంతకాలంగా తను లవ్ చేస్తున్న ముస్తఫా రాజ్ తో నిశ్చితార్ధ వేడుకను జరుపుకుంది. బెంగుళూరులోని బనశంకరిలో, కుటుంబసభ్యుల మధ్య, చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అయిన ముస్తఫాతో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. చాలా కాలం క్రితమే, తాను ముస్తఫారాజ్ ప్రేమించుకుంటున్నామని ప్రియమణి చెప్పేసింది. అయితే ఆమె అలా చెప్పేయడమే కెరీర్ కు దెబ్బ కొట్టింది. సడెన్ గా పెళ్లి చేసుకుంటే, తమ సినిమాలకు ఇబ్బందవుతుందని భావించిన దర్శక నిర్మాతలు, ప్రియమణిని పక్కన పెట్టేశారు. దాంతో గత కొంత కాలంగా అరకొర సినిమాలతోనే నెట్టుకొచ్చింది. తెలుగులో యమదొంగ, రగడ, వాంటెడ్ లాంటి సినిమాల్లో నటించిన ప్రియమణికి తమిళంలో చేసిన పరుత్తి వీరన్ సినిమాతో జాతీయ పురస్కారం లభించింది. ఇక పెళ్లి విషయానికొస్తే, చాలా నిరాడంబరంగా కేవలం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని ప్రకటించింది. తమ ప్రేమకు రెండు వైపులా పెద్దలు అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతానని అంటోందీ డస్కీ బ్యూటీ.