తెరపైకి "మహానటి" జీవితం..
on May 29, 2016
మహానటి సావిత్రి..తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే ఈ పేరు తెలియనివారు లేరు. సుమారు మూడు దశాబ్ధాలపాటు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి వెండితెర సామ్రాజ్ఞిగా, మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎంత ఎత్తుకు ఎదిగినా..చివరి దశలో ఆమె అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూశారు. ప్రజంట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జీవిత కథల మీద పడటంతో సావిత్రి జీవితకథను తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనున్న ఈ సినిమాకు మహానటి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చాలా కాలం నుంచి సావిత్రి జీవితంపై రిసెర్చ్ చేస్తున్న అశ్విన్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించేది ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది.