కబాలీ ఖాతాలో మరో రికార్డ్..!
on May 28, 2016

రికార్డులు బద్ధలవ్వకపోతే, అది సూపర్ స్టార్ సినిమా ఎందుకవుతుంది. కేవలం టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయకపోతే అది రజనీ సినిమా ఎందుకవుతుంది. ఏప్రిల్ 30 న విడుదలైన కబాలీ టీజర్ కు ఎలాంటి స్పందన లభించిందో తెలిసిందే. తక్కువ టైం లో ఎక్కువ మంది చూసిన సినిమా టీజర్లలో ప్రపంచంలోనే టాప్ 50 లో ఉంది కబాలీ టీజర్. తాజాగా ఈ టీజర్ 2 కోట్ల వ్యూస్ ను దాటేసి మరో రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకూ ఉన్న రికార్డునే ఈ టీజర్ అయినా టచ్ చేయాలంటే కష్టం. అలాంటింది మరిన్ని వ్యూస్ తో కబాలీ యూట్యూబ్ లో చెలరేగిపోతున్నాడు. మన దేశంలో 2 కోట్ల వ్యూస్ దాటిన తొలి మూవీ టీజర్ అన్న ఘనత కబాలీకే దక్కింది. దీని పట్ల మూవీ టీం సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. పా రంజిత్ డైరెక్ట్ చేసిన కబాలీని కలైపులి ఎస్ థాను నిర్మించారు. రజనీ భార్యగా లెజండ్ హీరోయిన్ రాధికా ఆప్టే నటిస్తోంది. జూలై 1 న రజనీ ఫ్యాన్స్ కు పండగ మొదలవనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



