తండ్రి మరణించాక ఓంకార్ ఏం చేశాడంటే...
on Oct 16, 2019
టీవీ ఆడియన్స్‌కు ఓంకార్ అన్నయ్య గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. రియాలిటీ డ్యాన్స్ షోలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్ అయ్యారు. సినిమా ఆడియన్స్‌కు జీనియస్, రాజుగారి గది సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ‘రాజుగారి గది 3’తో ఈ నెల 18న మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్స్‌లో ఓంకార్ ఎప్పుడూ తెల్లకుర్తాలో కనపడుతున్నారు. నిజానికి, ఓంకార్ స్టైల్ అది కాదు. సూట్స్ లేదా స్టైలిష్ డ్రస్సులో కనపడతారు. అటువంటి వ్యక్తి ఎందుకు తెల్లకుర్తా వేసుకుంటున్నారో తెలుసా? ఏడాది క్రితం ఓంకార్ తండ్రి మరణించారు. అప్పట్నుంచి ఆయన తెల్లకుర్తా వేసుకుంటున్నారు. ‘‘నాన్నగారు మరణించిన తర్వాత ఇలా తెల్లకుర్తా వేసుకుంటే ఆయన మాతోనే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతోంది. అమ్మానాన్నలు నాకు జన్మనిచ్చినా... నా కెరీర్‌కు జన్మను ఇచ్చింది మాత్రం నా ఇద్దరు తమ్ముళ్లు అశ్విన్‌బాబు, కల్యాణ్. అశ్విన్‌ను హీరోను చేయాలని నా కల. అది నా బాధ్యత. హీరోగా తమ్ముణ్ణి నిలబెట్టేవరకూ తెల్లకుర్తాలో ఉండాలని నిర్ణయించుకున్నా. 18న ఈ కుర్తా తీసేసి రోజు. తప్పకుండా సినిమా హిట్టవుతుంది. తర్వాత చిన్న తమ్ముడు కల్యాణ్‌ను నిర్మాతను చేస్తా’’ అని ఓంకార్ అన్నారు.
Also Read