
ఏ ప్రేక్షకుడు అన్నాడు, ఈ రోజుల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తేనే సినిమా చూస్తామని, సినిమా అంటే ఆకట్టుకునే కథ, కథనం, క్యారక్టర్ ల తీరు, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు, కథలో నుంచి పుట్టుకొచ్చే వినసొంపైన పాటలు, మాటలు అంతే. భారీ బడ్జెట్ సినిమాలు కూడా హిట్ అవ్వాలి. కానీ అంతకంటే ముఖ్యం పైన చెప్పుకున్న మెటీరియల్ అని చెప్తూ కన్నడ నాట 'ప్రేమద ఊరాలి' కలెక్షన్ల పెను తుఫాను సృష్టించి కేజిఎఫ్ రికార్డులకి మస్కా కొట్టి హాయ్ రాఖీ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పింది.
గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రేమద ఊరాలి' మౌత్ టాక్ పెరగడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ క్రమంగా పుంజుకుంది. కేవలం నెల రోజుల్లోనే ఏకంగా 135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కన్నడ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ప్రశాంత్ నీల్ - యశ్ కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ కన్నడ బాక్సాఫీస్ వసూళ్ల రికార్డును ఈ చిన్న సినిమా బ్రేక్ చేయడం విశేషం. 2018లో విడుదలైన ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ కన్నడ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సుమారు 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు సరిగ్గా అదే స్థాయికి పైగా కలెక్షన్లను సాధించి, కేజీఎఫ్ 1 రికార్డును ‘ప్రేమద ఊరాలి’ సమం చేయడమే కాకుండా కొన్ని ప్రాంతాలలో అధిగమించి కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: ఆ దెబ్బతో హిమాలయాలకి వెళ్లిపోవాలనుకున్నా..ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ప్రారంభ రోజుల్లో కేవలం పది వేల రూపాయల లోపు ఓపెనింగ్స్‌తో చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. కానీ, సినిమా చూసిన ప్రేక్షకులు అందించిన మౌత్ టాక్ పబ్లిసిటీ ఈ చిత్రానికి ఒక పెద్ద బూస్ట్‌లా పనిచేసింది. రెండో వారం వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారంలో సుమారు 6 కోట్ల గ్రాస్ రాబట్టి, ఆ తర్వాత రోజుల్లో 3.25 కోట్లు, 4.50 కోట్లు అంటూ నిలకడగా వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లింది.

ఈ విధంగా విడుదలైన 16 రోజుల్లోనే ఏకంగా 43.45 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి, క్రమంగా 135 కోట్ల క్లబ్‌లో చేరి శాండల్‌వుడ్‌లో నయా సెన్సేషన్ సృష్టించింది. ఈ అద్భుతమైన విజయం మరోసారి నిరూపించిన సత్యం ఏమిటంటే, చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్లు, వందల కోట్ల ఖర్చులు విజయానికి కొలమానం కానే కాదు. కేవలం హృద్యమైన కథ, సహజమైన నటన, ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు ఉంటే చాలు, చిన్న సినిమా కూడా పెద్ద రికార్డులను సునాయాసంగా తిరగరాయగలదు. బాక్సాఫీస్ లెక్కలను తలకిందులు చేస్తూ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా నిలిచిన ‘ప్రేమద ఊరాలి’ సక్సెస్ ట్రెండ్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఏ స్థాయి ఆదరణ దక్కుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకీ ప్రేమద ఊరాలి బడ్జెట్ ఎంతనుకున్నారు 2 కోట్లు. తెలుగులో కూడా 'ప్రేమనే ఊరిలో' అనే టైటిల్ తో రిలీజయ్యింది.కానీ మన వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.
[Premada Oorali Break Kgf Record, Premada Oorali movie, KGF Chapter 1 record, Kannada box office, small budget movie hits, Premada Oorali collections, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]





