
అభిమాని, సగటు ప్రేక్షకుడు సినిమా చూసి ఇంటికి వచ్చాకా కూడా హీరోయిన్ అందం, ఆమె నటన వాళ్ళ మనసుల్లో ఇంకా మెదులుతూనే ఉంటుంది. వాళ్ళ దృష్టిలో దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య కూడా. అంతలా హీరోయిన్ కట్ అవుట్ ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు ఆ భామనే సినిమాలు మానేసి హిమాలయాలకి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్పడం ఆ అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
నివేదా పేతురాజ్.. కెరీర్ స్టార్టింగ్ చూస్తే తెలుగు సినిమాలో తన హవా చాటుతుందని అందరు భావించారు. అందుకు తగ్గట్టే ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. . అయితే కెరీర్‌లో ఆశించిన స్థాయిలో వరుస విజయాలు అందుకోలేకపోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా ఆమె మాట్లాడుతూ కెరీర్‌లో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నాను. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నాను. కొంత గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం నాకు ఎంతో ప్రత్యేకం. దర్శకుడు నాగ్ అశ్విన్ కి చాలా థాంక్స్.ఈ సినిమా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. నాగ్ అశ్విన్ అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్నని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: బ్లడీ రోమియోనా మజాకానా: ధురంధర్ హవా పక్కా!.సాక్ష్యం ఇదే!
.webp)
సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తనకు ఓ వ్యక్తితో ఉన్న ప్రేమ బంధాన్ని పరిచయం చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వెల్లడించింది. అయితే ఆ తర్వాత వారి బంధం గురించి పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశమైంది.
[Nivetha Pethuraj latest Interview, Nivetha Pethuraj about Himalayas, Nivetha Pethuraj Latest Cinema,Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]






