
సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన ‘జైలర్ 2’ సినిమా భారీ వసూళ్లలో దూసుకుపోతోంది. విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా ఉన్న రజనీకాంత్ ‘2.0’ రికార్డును ఈ సినిమా అధిగమించింది.
దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ‘జైలర్ 2’కు మొదటి నుంచే మంచి స్పందన వచ్చింది. రజనీకాంత్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. దీంతో సినిమా ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ.730 కోట్లకు చేరినట్లు తాజా బాక్సాఫీస్ రిపోర్టులు వెల్లడించాయి.
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘2.0’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.720 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ‘జైలర్ 2’ ఆ మార్కును దాటడంతో తమిళ సినిమా వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. అంటే ఒకప్పుడు తన సినిమాతో నెలకొల్పిన రికార్డును రజనీకాంత్ మరో సినిమాతో అధిగమించినట్టే.

‘జైలర్ 2’ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. అన్ని చోట్లా భారీ వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వంద కోట్ల గ్రాస్ క్లబ్ కి చేరువ కావడం విశేషం.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.
మొత్తానికి ‘జైలర్ 2’తో రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఇంకెంత పెరుగుతాయి? రూ.800 కోట్ల మార్కును కూడా అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్.. డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌కి రీల్స్ పిచ్చి.!
[Jailer 2 Kollywood Industry Hit, Jailer 2 Kollywood Highest Grossing Movie, Jailer 2 Box Office Collection, 2.0 Movie Box Office, Jailer 2 WW Gross, Tamil Top Grosser, Kollywood Top Grosser, Rajinikanth, Nelson Dilipkumar]






