'సలార్' టీమ్ కి షాక్.. ప్రభాస్ ఫైట్ సీన్ లీక్!
on Oct 19, 2021
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సలార్'. 'బాహుబలి'తో హీరోగా ప్రభాస్, 'కేజీఎఫ్'తో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ మూవీ నుండి ఓ ఫైట్ సీన్ క్లిప్ లీక్ కావడం సంచలనంగా మారింది.
భారీ సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. షూటింగ్ టైంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రకంగా లీక్ అవుతూనే ఉంటున్నాయి. తాజాగా సలార్ నుండి ఒక చిన్న ఫైట్ క్లిప్ లీక్ అయింది. ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 10 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ప్రభాస్ రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని షూట్ చేస్తూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
'సలార్' ఫైట్ క్లిప్ లీక్ అవ్వడంపై మూవీ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో పవర్ ఫుల్ లుక్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొందరైతే బాహుబలి టైంలో కూడా ఇలాగే ఫైట్ సీన్ లీకైంది.. ఆ సెంటిమెంట్ ప్రకారం సలార్ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుంది అంటూ ఖుషీ అవుతున్నారు.
Also Read