అఖిల్ సినిమా రాకముందు నాగార్జున గారి ఇంటికెళ్లి సలహా ఇచ్చా: బన్నీ
on Oct 19, 2021
ఈ దసరా విన్నర్ గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా నిలిచింది. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలై భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ నేడు(మంగళవారం) గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అఖిల్ విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పిన బన్నీ.. ముందుగా అఖిల్ కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. "అఖిల్ ని చూస్తే నాకు యంగర్ బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. అఖిల్ సినిమా రాకముందే నాగార్జున గారి ఇంటికెళ్ళి అఖిల్ ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందేమో అని కొన్ని సజీషన్స్ ఇచ్చాను. అఖిల్ అంటే నాకు ఇష్టం అందుకే వేరే ఫ్యామిలీ హీరో అయినా కూడా ఇంటికెళ్ళి చెప్పాను. అఖిల్ కి ఇంత పెద్ద హిట్ రావడం నాకు పర్సనల్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ప్రయాణం ఎన్నో దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూ ఉంది. రీసెంట్ గా 'లవ్ స్టొరీ'తో నాగ చైతన్య హిట్ కొట్టాడు. ఇప్పుడు అఖిల్ హిట్ కొట్టాడు. ఇద్దరు బ్రదర్స్ హిట్ కొట్టడం నాగార్జున గారికి గ్రేట్ థింగ్. అలాగే పైనుండి నాగేశ్వరరావు కూడా చూసి సంతోషపడతారు." అంటూ బన్నీ అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు.
పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. 'పూజ.. మేడం సార్ మేడం' అంటూ 'అలవైకుంఠపురము' మూవీలోని డైలాగ్ చెప్పారు బన్నీ. "ముకుంద, డీజీ సినిమాలు టైం నుండి చూస్తున్నాను. ప్రతి సినిమాకి అందం పరంగా, పెర్ఫామెన్స్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉంది. ఈ సినిమాతో నటిగా ఇంకో రెండు మెట్లు ఎక్కింది. పూజ నువ్వు నాకు గుడ్ లక్ చార్మ్ అనుకున్నాను కానీ నువ్వు అందరు హీరోలకు గుడ్ లక్ చార్మ్ అయిపోయావు" అంటూ పూజాపై ప్రశంసలు కురిపించారు బన్నీ.
"బొమ్మరిల్లు, పరుగు తర్వాత భాస్కర్ ఏదోక రోజు గట్టి హిట్ కొడతాడని అనుకున్నాను. ఈ సినిమాతో కొట్టాడు" అంటూ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గురించి బన్నీ మాట్లాడారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ని ప్రశంసించిన బన్నీ.. నా సినిమాకు ఎప్పుడు పని చేస్తారని అడిగారు. అలాగే బన్నీ వాసు, వాసు వర్మతో పాటు ఇతర మూవీ టీమ్ కి బన్నీ కంగ్రాట్స్ చెప్పారు.
Also Read