పిచ్చ డిమాండ్‌లో సమంత.. తెలుగు వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధం?
on Oct 19, 2021
విడాకుల ప్రకటన తర్వాత సమంత రూత్ ప్రభు మంచి డిమాండ్ మీద ఉంది. ఇప్పటికే రెండు తెలుగు-తమిళ బైలింగ్వల్ సినిమాలకు సంతకం చేసిన ఆమె, టాప్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాతో ఓ వెబ్ సిరీస్ నిమిత్తం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదివరకు ఆహా కోసం 'సామ్ జామ్' అనే సెలబ్రిటీ టాక్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ షోలో సెలబ్రిటీ గెస్ట్‌లను ఆమె ఇంటర్వ్యూ చేసిన తీరు ఆడియెన్స్‌కు బాగా నచ్చడంతో 'సామ్ జామ్' ఇన్స్టంట్ హిట్టయింది. ఇప్పుడు సమంతతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఆహా సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఈ సిరీస్‌లో సమంత మెయిన్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ఇదివరకు 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌లో తమిళ ఈలమ్ మిలిటెంట్ రాజీగా కనిపించింది సమంత. ఆ పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్తోనూ సమంత మెప్పించింది.
గుణశేఖర్ పౌరాణిక చిత్రం 'శాకుంతలం' షూటింగ్‌ను కంప్లీట్ చేసిన సమంత, తమిళంలో విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో 'కాదు వాకుల రెండు కాదల్' మూవీ చేస్తోంది. లేటెస్ట్గా శంతరూబన్ డైరెక్షన్లో ఓ సినిమా, హరి శంకర్-హరీశ్ నారాయణ్ డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది.
Also Read