నితిన్‌ని నిలబెట్టాడు.. సునీల్‌కి లక్కిస్తాడా..?
on Nov 27, 2017

హీరోగా నిలబడాలంటే హిట్టు కొట్టకతప్పని పరిస్థితుల్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్ చేసిన సినిమా ఇష్క్. ఇది కనుక ఫెయిల్ అయితే హీరోగా తప్పుకోకతప్పదు. సరిగ్గా ఈ టైంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్క్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు హాజరవ్వడం నితిన్ ఫేట్‌ని మార్చేసింది. పవర్‌స్టార్‌కు నితిన్ బీభత్సమైన ఫ్యాన్ కావడంతో ఇష్క్ మూవీని పవన్ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని సూపర్‌హిట్ చేశారు. అప్పటి నుంచి నితిన్ తన ప్రతి మూవీలోనూ పవన్‌కు సంబంధించిన ఏదో ఒక ఎలిమెంట్ ఉండేలా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఇక కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్‌కు మొదట్లో అంతా బావుందనిపించింది.
కానీ ఒక బొమ్మ ఫ్లాప్ అయితే కానీ మనోడికి అసలు తత్త్వం బోధపడలేదు. అయినా చేసేదేమి లేదు.. ఇప్పుడు కమెడియన్‌గా వెనక్కి వెళ్లలేడు. అందుకే ఫ్లాప్‌లొచ్చినా సరే సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్.శంకర్ దర్శకత్వంలో సునీల్ నటించిన "టూ కంట్రీస్" మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. గ్యారెంటీగా హిట్ట్ కొట్టాలనే కసితో ఉన్న సునీల్ కూడా పవన్‌నే నమ్ముకున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ను పవర్‌స్టార్‌తో లాంఛ్ చేయించాడు. తద్వారా జనసేనాని అభిమానులను తనవైపుకు తిప్పుకున్నాడు భీమవరం బుల్లోడు. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో.. పవన్ ఫ్యాన్స్ సునీల్‌కు ఎంత వరకు సపోర్ట్ ఇస్తారో వేచి చూడాల్సిందే అంటున్నారు సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



