పోస్టర్ రివ్యూ: ఆజ్ఞాతవాసి
on Nov 27, 2017

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాకు ఇప్పటి వరకు అఫీషియల్ టైటిల్ ఫిక్స్ చేయలేదు.. ఆజ్ఞాతవాసి అన్న వర్కింగ్ టైటిల్‌తో పనికానిచ్చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆగుతారా.. ఏదో వాళ్లకు నచ్చిన టైటిల్‌ను ఫోటో షాప్‌లో ఎడిట్ చేసేసి సోషల్ మీడియాలో సర్క్యూలేషన్ చేస్తున్నారు. మరి అసలు టైటిల్ ఏంటీ..? ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న సమయంలో.. వీటన్నింటికి సమాధానం అతి త్వరలో చెబుతామంటూ ఫ్రీలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది హారికా హాసిని క్రియేషన్స్.
ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందరూ అనుకున్నట్లుగానే వర్కింగ్ టైటిల్‌నే మెయిన్ టైటిల్‌గా ఫిక్స్ చేసింది. "సోఫాలో కూర్చొని రఫ్‌గా చూస్తూ.. ఐడీ కార్డ్‌ని స్టైల్‌గా ఊపుతున్న పవన్ అదిరిపోతున్నాడు". అన్నట్లు ఆజ్ఞాతవాసి అన్న పదానికి అర్థం వచ్చేలా కింద ట్యాగ్ లైన్‌లో " Prince In Exile " అని పెట్టారు. అంటే ఆజ్ఞాతంలో ఉన్న రాకుమారుడు అని అర్థం. హారికా హసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ నటిస్తుండగా.. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



