ఉత్కంఠతో సీటు చివరన కూర్చున్నా!
on Nov 27, 2017

దిగ్గర దర్శకుడు శంకర్ కే టెన్షన్ పుట్టించిందొక సినిమా. తర్వాత ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠతో సీటు ముందు జరిగి చివర్లో కూర్చున్నాడట. ఇంతకీ శంకర్ కి అంత ఉత్కంఠను కలిగించిన సినిమా ఏంటా? అనుకుంటున్నారా? ఆ సినిమా పేరు ’తీరన్ అధిగారమ్ ఒండ్రు’. ఆ సినిమానే తెలుగులో ‘ఖాకీ’గా విడుదలై ఇక్కడ కూడా దుమ్ము దులిపేస్తోంది. వినోద్ దర్శకత్వంలో కార్తీ నటించిన ఈ సినిమాను ఇటీవల చెన్నయ్ లో శంకర్ చూశాడట. చూసినంత సేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయాడట. ఇక ఆనందం ఆపుకోలేక.. ట్విట్టర్లో ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు. ‘ఉత్కంఠను ఆపుకోలేకపోయాను. సీట్ చివర్లోకొచ్చి కూర్చొని చూడాల్సిన పరిస్థితి.
నిజంగా దర్శకుడు వినోద్ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కార్తీ నటన, గిబ్రణ్ రీరికార్డింగ్... ఫొటోగ్రఫీ.. అంతా వండర్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు శంకర్. కార్తీ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగునాట కూడా సంచలన విజయాన్ని అందుకొని మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అదనమాట విషయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



