'చాణక్య'కు పాజిటివ్ బజ్
on Oct 4, 2019
గోపీచంద్ హీరోగా నటించిన 'చాణక్య' మూవీ అక్టోబర్ 5న విడుదలవుతోంది. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని తమిళ చిత్రాలతో పేరు సంపాదించుకున్న తెలుగు యువకుడు తిరు డైరెక్ట్ చేశాడు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై నిర్మాణమైన ఈ సినిమాకు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాకు విడుదలకు ముందు ఇలాంటి బజ్ రావడం ఇప్పుడే.
2014లో వచ్చిన 'జిల్' మూవీ తర్వాత గోపీచంద్‌కు ఆ రేంజ్ హిట్ రాలేదు. 'సౌఖ్యం', ఆక్సిజెన్' సినిమాలు డిజాస్టర్ కాగా, 'గౌతం నందా', 'పంతం' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచాయి. వీటిలో 'పంతం' గోపీ 25వ సినిమా కావడం గమనార్హం. ఇప్పుడు అనూహ్యంగా 'చాణక్య'కు క్రేజ్ రావడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ క్రేజ్‌కు తగ్గట్లే 'చాణక్య' నాన్-థియేట్రికల్ రైట్స్ మంచి ధర పలికాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ 9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా, తెలుగు శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా చానల్ 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే అమెజాన్ ప్రైం వీడియో హక్కులు మరో 2 కోట్ల రూపాయలు పలికాయి. వెరసి శాటిలైట్, డిజిటల్ హక్కులే 15 కోట్లు పలకడం గోపీచంద్ సినిమాకు సంబంధించి విశేషమే.
స్పై థ్రిల్లర్‌గా తయారైన ఈ మూవీలో 'రా' ఏజెంట్‌గా గోపీ కనిపించనున్నాడు. యాక్షన్ సీన్లు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ సీన్లు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు ఈ సినిమాకి హైలైట్ అవుతాయనేది యూనిట్ సభ్యుల మాట. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న 'చాణక్య' అంచనాలను అందుకుంటుందో, లేదో చూడాలి.
Also Read