'ఇండియన్ 2'లో అజయ్ దేవ్‌గణ్, అనిల్ కపూర్.. ఇద్దరూ ఉన్నట్లేనా?
on Oct 4, 2019
సౌంత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో '2.0' చేసిన తర్వాత డైరెక్టర్ శంకర్, ఇప్పుడు 'లోకనాయకుడు' కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2' సినిమా చేస్తున్న విషయం మనకు తెలుసు. వరుసగా ఇది శంకర్‌కు రెండో సీక్వెల్. '2.0' మూవీ 'రోబో'కు సీక్వెల్ కాగా, 'ఇండియన్ 2' మూవీ 'ఇండియన్'కు సీక్వెల్. తెలుగులో 'భారతీయుడు'గా విడుదలైన 'ఇండియన్' మూవీ, ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ సినిమాలోని 'పచ్చని చిలుకలు తోడుంటే..', 'మాయా మశ్చీంద్రా మచ్చని చూడ వచ్చావా', 'టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా', 'అదిరేటి డ్రస్సు మేమేస్తే' పాటలు చాలాకాలం జనం నాలుకలపై ఆడాయి.
ఇప్పుడు ఆ సినిమాకు శంకర్ సీక్వెల్ తీస్తున్నాడనే విషయం అందరిలోనూ ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తెలుగువాళ్లకు ఎంతో ఇష్టులైన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకున్న సిద్ధార్థ్ ఒక కీలక కేరెక్టర్ చేస్తుండగా, కండల వీరుడు విద్యుత్ జమ్వాల్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. అయితే 'ఇండియన్ 2'కు పాన్-ఇండియా లుక్ రావాలంటే.. బాలీవుడ్ టాప్ యాక్టర్లు ఉండాల్సిందే కదా. '2.0' సినిమాలో అక్షయ్ కుమార్‌ను విలన్‌గా చూపించిన శంకర్.. 'ఇండియన్ 2'లో మరో టాప్ బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్‌ను విలన్‌గా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
అజయ్ దేవ్‌గణ్ ఈ సినిమా చేస్తున్నాడనే విషయం చాలా రోజుల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. తాజాగా వెటరన్ బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ను శంకర్ సంప్రదించడంతో అజయ్ దేవ్‌గణ్ ప్లేస్‌లో అనిల్ కపూర్ వస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు అజయ్ దేవ్‌గణ్, అనిల్ కపూర్ ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారమూ నడుస్తోంది. దీనిపై శంకర్ వైపు నుంచి ఎలాంటి అఫిషియల్ న్యూస్ రాలేదు. కాగా రాజమౌళి లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ ఆర్ ఆర్'లోనూ అజయ్ దేవ్‌గణ్ ఒక ప్రధాన పాత్ర చేస్తున్న విషయం మనకు తెలుసు. ఒక బాలీవుడ్ స్టార్ సౌత్‌లో ఇలా వరుసగా రెండు సినిమాలు చేస్తుండటం ఇదే తొలిసారి.
'ఇండియన్ 2' మూవీకి సంబంధించి ఇప్పటికే చెన్నైలో రెండు చిన్న షెడ్యూల్స్ జరిపాడు శంకర్. ఈ షెడ్యూల్స్‌లో కమల్ హాసన్‌కు సంబంధించిన సీన్స్ తీశాడు. ఒకవైపు తమిళ 'బిగ్ బాస్ 3' హోస్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ షూటింగ్‌లో ఆయన పాల్గొంటూ వచ్చాడు. ఇప్పుడు మూడో షెడ్యూల్ రాజమండ్రిలో ప్లాన్ చేశాడు శంకర్. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం.
200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. వాస్తవానికి గత ఏడాది ఈ సినిమాని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకు రాగా, తర్వాత శంకర్‌తో వచ్చిన విభేదాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత కూడా ఈ సినిమా ఆగిపోయిందనే వారలు వచ్చినా, ఎట్టకేలకు ఆగస్టులో షూటింగ్ మొదలైంది. నేటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి 'సైరా' సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనిచేస్తున్నాడు. 2021 పొంగల్ లేదా సమ్మర్‌కి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది శంకర్ సంకల్పం.